తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అదే జరిగితే.. కోహ్లీ తప్పుకుంటాడేమో' - కోహ్లీ కెప్టెన్సీపై మాంటీ పనేసర్​

కోహ్లీ సారథ్యంలో టీమ్​ఇండియా సరిగా ఆడలేకపోతుందని అభిప్రాయపడ్డాడు ఇంగ్లాండ్​ మాజీ స్పిన్నర్​ మాంటీ పనేసర్​. ఇప్పటికే విరాట్​ సారథ్యంలో వరుసగా నాలుగు టెస్టులో ఓడిపోయిన భారత్.. ఇంగ్లాండ్​తో జరగబోయే రెండో టెస్టులోనూ ఓడితే అతడు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడేమోనని అన్నాడు.

kohli
కోహ్లీ

By

Published : Feb 11, 2021, 12:28 PM IST

టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడే అయినా, అతడి సారథ్యంలో భారత్‌ సరిగ్గా ఆడలేకపోతోందని ఇంగ్లాండ్‌ మాజీ స్పిన్నర్‌ మాంటీ పనేసర్‌ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ సారథ్యంలో గత నాలుగు టెస్టుల్లో భారత్‌ ఓటమి చవిచూసింది. అదే సమయంలో రహానె ఆస్ట్రేలియా పర్యటనలో జట్టును విజయపథంలో నడిపించాడు. ఈ క్రమంలోనే పనేసర్‌ ఒక సందర్భంలో మాట్లాడుతూ కోహ్లీ నాయకత్వంపై తన అభిప్రాయాలు వ్యక్తపరిచాడు.

"ఆల్‌టైమ్‌ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో విరాట్‌ కోహ్లీ ఒకడు. కానీ, అతడి నేతృత్వంలో భారత్‌ సరిగ్గా ఆడటం లేదనిపిస్తోంది. అతడి కెప్టెన్సీలో గత నాలుగు టెస్టుల్లోనూ టీమ్‌ఇండియా ఓడిపోవడం చూశాం. అదే సమయంలో కెప్టెన్‌గా అజింక్య రహానె అద్భుత ప్రదర్శన చేశాడు. కాబట్టి టీమ్‌ఇండియా సారథి ఇప్పుడు మరింత ఒత్తిడికి గురవుతుంటాడు. తర్వాతి మ్యాచ్‌లోనూ భారత జట్టు ఓటమిపాలైతే కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడేమో" అని పనేసర్‌ చెప్పుకొచ్చాడు.

కాగా, కోహ్లీ సారథ్యంలో టీమ్‌ఇండియా చివరిసారి టెస్టుల్లో 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. రెండు టెస్టుల ఆ సిరీస్‌లో భారత్‌ సిరీస్‌ కైవసం చేసుకుంది. ఆపై గతేడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో ఆ జట్టుతో జరిగిన రెండు టెస్టుల్లో ఓటమిపాలైంది. ఇక డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాభవం పాలైంది. ఇప్పుడు తాజాగా ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులోనూ ఓటమిచెందింది. ఈ నేపథ్యంలోనే కోహ్లీ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఇదీ చూడండి:కోహ్లీ కెప్టెన్సీని ఎంతో ప్రేమిస్తా: జమైకా స్ప్రింటర్

ABOUT THE AUTHOR

...view details