టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లిపై ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రానున్న టీ20, వన్డే ప్రపంచకప్‌లను భారత జట్టు గెలవకపోతే కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని అభిప్రాయపడ్డాడు. కోహ్లి సారథ్యంలో టీమ్ఇండియా సిరీస్‌లు చాలానే గెలిచినా.. ఐసీసీ ట్రోఫీలను సొంతం చేసుకోవడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు మాంటీ.
'భారత్ వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్.. ఈ రెండింటిలో కనీసం ఒక్కదాన్నయినా కోహ్లీ కెప్టెన్సీలో గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది జరగకపోతే సారథి పదవి నుంచి కోహ్లీ దిగిపోవాల్సిందే. అతడు లేకున్నా టీమ్ఇండియా సిరీస్‌లు గెలవగలదని ఆసీస్ పర్యటనతో నిరూపితమైంది. రహానె, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కలిసి నాయకత్వం వహిస్తూ తీసుకునే నిర్ణయాలు బాగా పనిచేస్తాయని నా అభిప్రాయం. విరాట్ దూకుడైన ఆటతీరు నాకు నచ్చుతుంది. కానీ తన వైఖరి మార్చుకోవాలి. టెస్టు సిరీస్‌లో రహానె, రోహిత్ శర్మ, రవిశాస్త్రితో కలిసి వారి అభిప్రాయాలను కూడా తీసుకోవాలి.'