యుజ్వేంద్ర చాహల్ అద్భుత స్పిన్నర్ అని అందరికీ తెలుసు. కానీ అతడో మంచి బ్యాట్స్‌మన్ అని ఎంతమందికి తెలుసు. అవును.. చాహల్ ఓ అండర్-19 మ్యాచ్‌లో సెంచరీ కూడా చేశాడు. ఈ విషయాన్ని ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్వీట్ చేసింది. అయితే దీనికి టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ ఫన్నీ కామెంట్ చేశాడు.
చాహల్ సెంచరీ.. ట్రోల్ చేసిన కోహ్లీ - యుజ్వేంద్ర చాహల్ తాజా వార్తలు
చాహల్‌కు సంబంధించిన ఓ ఫొటోను ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్వీట్ చేసింది. దీనిపై స్పందిస్తూ విరాట్ కోహ్లీ చాహల్‌ను ట్రోల్ చేశాడు.
కోహ్లీ
2008-09 కూచ్ బెహర్ ట్రోఫీ హిమాచల్ ప్రదేశ్ అండర్-19 జట్టులో జరిగిన మ్యాచ్‌లో చాహల్ 135, 46 పరుగులు చేశాడు. ఇదే విషయాన్ని ఆర్సీబీ ట్వీట్ చేసింది. దీనికి కోహ్లీ స్పందిస్తూ.. "అదేదో ఎగ్జిబిషన్ మ్యాచ్ అయ్యుంటుంది" అంటూ నవ్వుతున్న ఎమోజీలతో ట్రోల్ చేశాడు.
ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా క్రికెటర్లందరూ ఇంటిపట్టునే ఉన్నారు. చాహల్ వరుస టిక్‌టాక్ వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో అభిమానులను పలకరిస్తున్నాడు.