తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫోర్బ్స్​ జాబితా.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ - Akshay Kumar

ప్రఖ్యాత ఫోర్బ్స్​​ ఇండియా టాప్-100 ప్రముఖల జాబితాలో క్రికెటర్ విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అక్షయ్ కుమార్, సల్మాన్​ఖాన్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. మొత్తం వంద మంది ఉన్న ఈ జాబితాలో 14 మంది క్రికెటర్లే ఉండటం విశేషం. తెలుగు వాళ్లు నలుగురు.. ఈ లిస్ట్​లో చోటు దక్కించుకున్నారు.

Virat Kohli topples Salman Khan for top spot on 2019 Celebrity 100 list
ఫోర్బ్ జాబితా

By

Published : Dec 19, 2019, 1:49 PM IST

ఫోర్బ్స్​ ఇండియా టాప్-100 ప్రముఖుల జాబితాను ప్రకటించింది. అత్యధికంగా సంపాదించే, వంద మంది ప్రముఖుల జాబితాను ఫోర్బ్స్​ మ్యాగజైన్ ప్రచురిస్తుంది. ఈ ఏడాది ప్రకటించిన ఆ లిస్ట్​లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. రెండు, మూడు స్థానాల్లో అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ నిలిచారు.

కోహ్లీ రెండు నుంచి టాప్​కు

గతేడాది రెండో స్థానంలో ఉన్న కోహ్లీ.. ఈ ఏడాది రూ.252.72 కోట్లు ఆర్జించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గతేడాది టాప్​లో ఉన్న సల్మాన్.. మూడో స్థానానికి దిగజారాడు. అమితాబ్ 4, ధోనీ 5, షారుక్ 6వ స్థానంలో ఉన్నారు. దక్షిణాది నుంచి సూపర్​స్టార్ రజనీకాంత్(13) ఈ జాబితాలో ముందున్నాడు.

వందలో 14 మంది క్రికెటర్లే

ఫోర్బ్స్​ ప్రకటించిన టాప్-100లో 14 మంది క్రికెటర్లే ఉండటం విశేషం. కోహ్లీ తొలి స్థానంలో ఉండగా.. గతేడాది ఉన్న స్థానాల్లోనే ధోనీ(5), సచిన్(9) కొనసాగుతున్నారు. 2018లో 23వ స్థానంలో ఉన్న రోహిత్ శర్మ.. 12 స్థానాలు ఎగబాకి 11కు చేరుకున్నాడు.

రిషబ్ పంత్(30), హార్దిక్ పాండ్య(31), బుమ్రా(33), కేఎల్ రాహుల్(34), శిఖర్ ధావన్(35), జడేజా(51), కుల్దీప్ యాదవ్(61), మిథాలీరాజ్(88), స్మృతి మంధాన(90), హర్మన్​ప్రీత్ కౌర్(91) టాప్-100లో చోటు దక్కించుకున్నారు.

ఫోర్బ్స్​ లిస్టులో అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ

తెలుగు ప్రముఖులు నలుగురే..

ఫోర్బ్స్​ టాప్-100లో తెలుగు సెలబ్రెటీలు నలుగురు మాత్రమే చోటు దక్కించుకున్నారు. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్(44) ఈ వరుసలో ముందున్నాడు. మహేశ్​బాబు(54), పీవీ సింధు(63), త్రివిక్రమ్ శ్రీనివాస్(77) ఈ జాబితాలో స్థానం పొందారు.

ఇదీ చదవండి: ఐపీఎల్లో పంజాబ్​ జట్టుకు వసీం జాఫర్..!

ABOUT THE AUTHOR

...view details