త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న కోహ్లీ.. టెస్టు సిరీస్‌లో భాగంగా చివరి మూడు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అదే సమయంలో సతీమణి అనుష్క.. బిడ్డకు జన్మనిచ్చే అవకాశముంది. అందులో భాగంగానే కోహ్లీ స్వదేశానికి తిరిగి రానున్నాడు.
అయితే కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేందుకు రోహిత్ శర్మ.. చివరి మూడు టెస్టులకు అందుబాటులో ఉండనున్నాడు.
నవంబరు 27 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనున్నారు. డిసెంబరు 17-21 మధ్య డే/నైట్ విధానంలో మొదటి టెస్టు జరగనుంది.
ఆస్ట్రేలియా పర్యటన కోసం జరిగిన ఇతర మార్పులు
- తొలి టెస్టు తర్వాత స్వదేశానికి రానున్న కోహ్లీ
- వన్డే, టీ20లకు విశ్రాంతినిచ్చిన రోహిత్ శర్మ.. చివరి మూడు టెస్టులు ఆడనున్నాడు.
- వన్డేల్లో సంజూ శాంసన్ అదనపు వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నాడు.
- గాయం తగ్గిన తర్వాత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ జట్టుతో కలవనున్నాడు.
- భుజం గాయం కారణంగా వరుణ్ చక్రవర్తిని టీ20 సిరీస్ నుంచి తప్పించారు. అతడి స్థానాన్ని నటరాజన్ భర్తీ చేయనున్నాడు.
- తొడ కండరాల గాయంతో బాధపడుతున్న టెస్టు వికెట్ కీపర్ సాహా పరిస్థితిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశముంది.
- యువ బౌలర్ కమలేశ్ నాగర్కోటి.. పని ఒత్తిడి కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడం లేదు.
ఇవీ చదవండి: