త్వరలో మొదలయ్యే ఐపీఎల్ కోసం అన్ని జట్లు ప్రాక్టీసులో మునిగితేలుతున్నాయి. దాదాపు ఐదు నెలలకు పైగా ఇంట్లోనే ఉన్న క్రికెటర్లు.. మైదానంలో తీవ్రంగా కృషి చేస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ల్లో చెమటోడ్చుతున్నారు. ఈ క్రమంలో కెప్టెన్ కోహ్లీ అద్భుతంగా క్యాచ్ పట్టిన వీడియోను ఆర్సీబీ ట్వీట్ చేస్తూ, ఈ సమయంలో చెప్పాల్సింది ఏం లేదు అని ఓ సరదా వ్యాఖ్యను జోడించింది. ఇప్పుడే ఇలా ఉంటే మ్యాచ్ల్లో చెలరేగిపోతాడేమో అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
ఐపీఎల్ ప్రాక్టీసులో కోహ్లీ అద్భుత క్యాచ్! - ipl 2020 kohli
కోహ్లీ ప్రాక్టీసు చేస్తున్న వీడియోను పోస్ట్ చేసిన ఆర్సీబీ, చెప్పడానికి ఏం లేదు ఓ వ్యాఖ్యను జోడించింది. సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది.
కెప్టెన్ కోహ్లీ
సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు మ్యాచ్లు మ్యాచ్లు జరగనున్నాయి. ఇందుకోసం దుబాయ్, షార్జా, అబుదాబీ మైదానాలు ఈ టోర్నీకి వేదికలు.