మధ్యప్రదేశ్లోని ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు సిద్ధమవుతోంది టీమిండియా. అయితే జట్టు సారథి విరాట్ కోహ్లీ మాత్రం స్థానిక చిన్నారులతో కలిసి సరదాగా గడిపాడు. ఓ ప్రకటన కోసం షూటింగ్లో భాగంగా పిల్లలతో గల్లీ క్రికెట్ ఆడాడు ఈ స్టార్ బ్యాట్స్మన్.బ్యాటింగ్ చేయడమే కాకుండా వాళ్లకు బౌలింగ్ కూడా చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
చిన్నారులతో గల్లీ క్రికెట్ ఆడిన విరాట్ కోహ్లీ - virat gullyboy
ఇటీవల బంగ్లాతో టీ20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న విరాట్... మళ్లీ మైదానంలో సందడి చేయనున్నాడు. ఇప్పటికే అదే జట్టుతో తొలి టెస్టు కోసం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఉంది టీమిండియా. తాజాగా విరాట్ అక్కడి స్థానిక చిన్నారులతో కలిసి గల్లీ క్రికెట్ ఆడాడు.
![చిన్నారులతో గల్లీ క్రికెట్ ఆడిన విరాట్ కోహ్లీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5039752-713-5039752-1573555871495.jpg)
చిన్నారులతో విరాట్ కోహ్లీ గల్లీ క్రికెట్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు కోహ్లి విశ్రాంతి తీసుకున్నాడు. ఈ సారథికి బదులుగా తాత్కాలిక కెప్టెన్గా రోహిత్ బాధ్యతలు చేపట్టాడు. అయితే గురువారం నుంచి ప్రారంభంకానున్న టెస్టు సిరీస్‌కు.. విరాట్ సారథ్యంలో బరిలోకి దిగనుంది టీమిండియా.
రెండో టెస్టు నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈడెన్ గార్డెన్‌లో జరగనున్న ఈ మ్యాచ్ను తొలిసారి డే/నైట్ రూపంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది బీసీసీఐ.
Last Updated : Nov 12, 2019, 4:46 PM IST