తెలంగాణ

telangana

ETV Bharat / sports

అనుష్క సినిమా షూటింగ్​లోనే నిద్రపోయిన కోహ్లీ - అనుష్క శర్మ తాజా వార్తలు

భారత ఫుట్​బాల్ స్టార్ సునీల్ ఛెత్రీతో ఇన్​స్టాగ్రామ్ లైవ్ చాట్​లో పాల్గొన్నాడు టీమ్​ఇండియా సారథి విరాట్ కోహ్లీ. ఈ సందర్భంగా ఛెత్రీ.. విరాట్​ను పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు.

కోహ్లీ
కోహ్లీ

By

Published : May 19, 2020, 5:46 AM IST

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ ఒక సందర్భంలో తన భార్య అనుష్కశర్మని వదిలేసి వెళ్లాడని భారత ఫుట్‌బాల్‌ స్టార్‌ సునీల్‌ ఛెత్రీ అన్నాడు. తాజాగా, కోహ్లీతో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌చాట్‌లో మాట్లాడిన ఛెత్రీ.. విరాట్​ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సందర్భంగా టీమ్‌ఇండియా సారథిని ఇరకాటంలో వేస్తూ.. పలు ప్రశ్నలు సంధించాడు. ఛెత్రీ మాటలకు ఆశ్యర్యపోయిన విరాట్‌ తర్వాత అతడి ప్రశ్నలకు వివరణలు ఇచ్చాడు. గంటకుపైగా సాగిన సంభాషణలో ఇద్దరి మధ్య అనేక విషయాలు చర్చకు వచ్చాయి.

ఈ సందర్భంగా ఛెత్రీ మాట్లాడుతూ.. అనుష్కశర్మ కోహ్లీకి ఎంతో మద్దతుగా ఉంటుందని, అతనాడే మ్యాచ్‌లన్నీ చూస్తుందని చెప్పాడు. కోహ్లీ బ్యాటింగ్‌ చేయకపోయినా మ్యాచ్‌ మొత్తం చూస్తుందని చెప్పాడు. అయితే, కోహ్లీ మాత్రం అలా ఉండడని, ఛెత్రీ అన్నాడు. ఎందుకంటే.. ఒకసారి అనుష్క నటిస్తున్న సినిమా సెట్‌కి వెళ్లి అక్కడే నిద్రపోయాడని చెప్పాడు. అనుష్క విదేశాల్లో షూటింగ్‌ చేస్తుండగా కోహ్లీ అక్కడికెళ్లాడని, వెంటనే సినిమా సెట్లోనే నిద్రపోయాడని ఛెత్రీ అన్నాడు.

ఈ విషయంపై కోహ్లీ వివరణ ఇస్తూ.. తాను అప్పటికే విమానంలో గంటల తరబడి ప్రయాణం చేశానని, ఫ్లైట్‌ దిగేసరికి చీకటిపడడం వల్ల హోటల్‌లో రూమ్‌ దొరకలేదని చెప్పాడు. దాంతో నేరుగా అనుష్క సినిమా షూటింగ్‌ సెట్‌కు వెళ్లిన కారణంగా బాగా అలసిపోయి అక్కడే పడుకున్నానని తెలిపాడు. తాను అలసిపోతే నిద్రకు ఆగలేనని కోహ్లీ వివరించాడు. అతనలా చెబుతుండగానే అనుష్క వెనక నుంచి 'అబద్ధాల కోరు' అంటూ వ్యాఖ్యానించింది. దాంతో ఛెత్రీ, కోహ్లీ ఒకటే నవ్వుకున్నారు.

తర్వాత ఛెత్రీ మరో ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. గతేడాది వీరిద్దరూ భూటాన్‌ పర్యటనకు వెళ్లినప్పుడు సైక్లింగ్‌ చేస్తూ కోహ్లీ, అనుష్కను వదిలేసి వెళ్లిపోయాడని చెప్పాడు. దీనికి ఆశ్చర్యపోయిన టీమ్‌ఇండియా సారథి.. ఈ విషయాలన్నీ ఛెత్రీకి ఎప్పుడు చెప్పావని తన భార్యను అడిగాడు. అనంతరం ఈ విషయంపైనా స్పందించాడు. తామిద్దరం సైక్లింగ్‌ చేస్తుండగా అనుష్క తన వెనక ఉందని, అదే సమయంలో ఎవరో అభిమాని తనని గుర్తుపట్టడం వల్ల అనుష్కను వదిలేసి అక్కడి నుంచి ముందుకెళ్లానని చెప్పాడు. కొద్దిదూరం దూరం వెళ్లాక ఆమె కనిపించలేదని.. అందువల్ల మళ్లీ వెనక్కి తిరిగెళ్లానని కోహ్లీ చెప్పాడు. అప్పుడు అనుష్కకు కోపం వచ్చి తానెవరో తెలియదన్నట్లు ప్రవర్తించిందని నాటి ఘటనను గుర్తుచేసుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details