తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోహ్లీ అందుకే స్లెడ్జింగ్​ చేస్తాడు' - పరుగులు తీయలేనప్పుడు కోహ్లీ స్డెడ్జింగ్​ చేస్తాడు

టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ క్రీజులో ఉన్నప్పుడు పరుగులు తీయడంలో విఫలమైతే, బౌలర్లను స్లెడ్జింగ్​ చేస్తాడని చెప్పాడు బంగ్లాదేశ్​ బౌలర్​ అల్​ అమీన్​ హుస్సేన్.

kohli
కోహ్లీ

By

Published : May 10, 2020, 6:59 PM IST

టీమిండియా సారథి విరాట్​ కోహ్లీకి డాట్ బాల్ వేస్తే ఆ బౌలర్​పై స్లెడ్జింగ్​కు దిగుతాడని చెప్పాడు బంగ్లాదేశ్​ బౌలర్​ అల్​ అమీన్. సదరు బౌలర్​పై ఒత్తిడి పెంచేందుకు, అతడ్ని మానసికంగా డిస్టర్బ్​ చేసేందుకు ఇలాంటి పనిచేస్తాడనే విషయాన్ని ఓ టీవీ ఛానెల్ లైవ్​​లో వెల్లడించాడు.

"కోహ్లీకి ఎవరైనా డాట్​ బాల్​ వేస్తే.. ప్రతిసారి ఆ బౌలర్​పై స్లెడ్జింగ్​ చేస్తాడు. అసభ్యకర పదజాలం ఉపయోగిస్తాడు. అతడిపై మానసికంగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. గొప్ప బ్యాట్స్​మెన్​ క్రిస్​ గేల్, శిఖర్​ ధావన్​, రోహిత్ శర్మ వంటి వారికి బౌలింగ్​ వేశాను. వాళ్లెవరూ ఇలా లేరు. కోహ్లీ మాత్రం స్లెడ్జ్​ చేస్తాడు"

-అల్​ అమీన్​ హుస్సేన్, బంగ్లాదేశ్​ బౌలర్

ఇటీవలే మరో ఇంటర్వ్యూలో మాట్లాడిన బంగ్లాదేశ్​కు చెందిన మరో బౌలర్ రుబెల్ హుస్సేన్.. అండర్-19 స్థాయి నుంచే కోహ్లీ స్లెడ్డింగ్​కు దిగేవాడని చెప్పుకొచ్చాడు.

ABOUT THE AUTHOR

...view details