లాక్డౌన్ కారణంగా అనేక రంగాలతో పాటు క్రీడాకారులకూ తీరిక సమయం దొరికింది. ఈ క్రమంలోనే భార్య అనుష్క శర్మతో ముంబయిలోని నివాసంలో గడుపుతున్న విరాట్ కోహ్లీ.. పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి ముందు గడిపిన సమయాన్ని ప్రేమగా గుర్తు చేసుకుంటూ.. అప్పటి ఫొటోను ఇన్స్టాలో అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో టీమ్ఇండియా సారథి, నటి అనుష్కతో కలిసి ఓ సరస్సు ఒడ్డున కూర్చొని కనిపించాడు.
"ప్రకృతిలో ఇలాంటి అందమైన ప్రదేశాలకు మీరు ఎప్పుడు వెళ్లారో గుర్తు తెచ్చుకోండి. కలిసి కూర్చొని అన్నింటినీ మర్చిపోవడం జరిగేది ఒక్క నా ప్రేమ (అనుష్క శర్మ)తోనే సాధ్యం."