ఈ లాక్డౌన్ సమయంలో కొంత మంది క్రికెటర్లు ఆన్లైన్ సెషన్లలో పాల్గొంటూ ముచ్చట్లు పెడుతుంటే.. మరికొందరు వారి పాత స్మృతులను స్మరించుకుంటున్నారు. తాజాగా, టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెట్టు ఎక్కి సేద తీరుతున్నప్పటి ఫొటోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు.
చెట్టు మీద విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ! - virat kohli lockdown
లాక్డౌన్ సమయంలో గత స్మృతులను గుర్తు చేసుకున్నాడు టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఇందులో భాగంగా తను చెట్టు ఎక్కి విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.
ఈ క్రమంలోనే "మీరు కూడా నాలాగే చెట్టు ఎక్కి చిల్ అయినప్పటి సందర్భాన్ని గుర్తు చేసుకోండి" అంటూ రాసుకొచ్చాడు. దీంతో నెటిజన్లు కోహ్లీపై సరదా కామెంట్లు చేస్తున్నారు.
సెప్టెంబరు 19న యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న ఐపీఎల్లో.. కోహ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుకు సారథ్యం వహించనున్నాడు. కోహ్లీ ఇప్పటి వరకు 177 ఐపీఎల్ మ్యాచ్ల్లో ఆడగా.. 37.84 సగటుతో 5,412 పరుగులు చేశాడు. ఈ లీగ్లో ఐదు సెంచరీలు, 36 అర్ద సెంచరీలు సహా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అయితే, ఇప్పటి వరకు కోహ్లీ జట్టు టైటిల్ గెలవలేదు.