తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ రికార్డు.. తొలి భారత కెప్టెన్​గా ఘనత - విరాట్ కోహ్లీ రికార్డు

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో విజయం సాధించింది టీమ్ఇండియా. ఈ గెలుపుతో సారథి విరాట్ కోహ్లీ పలు రికార్డులు కైవసం చేసుకున్నాడు.

Virat Kohli sets new India captaincy records
ఆసీస్​పై టీ20 సిరీస్​ గెలుపుతో కోహ్లీ రికార్డు

By

Published : Dec 7, 2020, 12:16 PM IST

ఆస్ట్రేలియాతో టీమ్‌ఇండియా తొలి రెండు వన్డేలు ఘోరంగా ఓటమిపాలయ్యే సరికి అంతా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నాయకత్వాన్ని విమర్శించారు. కానీ, అదే కోహ్లీ ఇప్పుడు రెండు గొప్ప ఘనతలు సాధించి అందరి చేతా శభాష్‌ అనిపించుకుంటున్నాడు. 2018-19 సీజన్‌లో కంగారూల గడ్డపై వన్డే, టెస్టు సిరీస్‌ గెలుపొందిన విరాట్‌.. అప్పుడు మిగిలిపోయిన టీ20 సిరీస్‌ను ఇప్పుడు కైవసం చేసుకున్నాడు. దీంతో దిగ్గజ ఆటగాడు, మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీకి వీలుకాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కంగారూ గడ్డపై అన్ని ఫార్మా ట్లలో సిరీస్​ గెలిచిన తొలి భారత కెప్టెన్​గా ఘనత సాధించాడు.

అలాగే సేనా దేశాల(దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా)పై టీ20 సిరీస్​లు గెలిచిన తొలి భారతీయ కెప్టెన్​గానూ ఘనత వహించాడు కోహ్లీ.

దీంతోపాటు ఏడాది కాలంగా పొట్టి క్రికెట్‌లో భారత్‌కు ఓటమే ఎరుగకుండా వరుసగా పది విజయాలు అందించాడు విరాట్. ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమ్‌ఇండియా గెలవడంతో ఈ ఘనతలు దక్కాయి.

ABOUT THE AUTHOR

...view details