తెలంగాణ

telangana

ETV Bharat / sports

'సూపర్‌ మ్యాన్'​లా కోహ్లీ క్యాచ్​ పడితే! - kohli superman catch

గతేడాది ఐపీఎల్​లో ఆర్సీబీ ఆటగాడు ఏబీ డివిలియర్స్​ 'సూపర్​మ్యాన్​ క్యాచ్'​ను.. రిక్రియేట్​ చేశాడు ఆ జట్టు సారథి కోహ్లీ. దీనికి సంబంధించిన ఫొటోను ఫ్రాంచైజీ పోస్ట్​ చేయగా.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Virat Kohli
కోహ్లీ

By

Published : Sep 20, 2020, 10:36 AM IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్ పట్టిన ఓ క్యాచ్ ఐపీఎల్ చరిత్రలోనే అద్భుత క్యాచ్‌గా నిలిచిపోయింది. గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద నిల్చున్న ఏబీడీ.. అమాంతం గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నాడు. సూపర్‌మ్యాన్ ఫీట్‌ను తలపించిన ఈ క్యాచ్ అప్పట్లో అందరినీ ఆకట్టుకుంది.

అయితే తాజాగా ఈ సూపర్ క్యాచ్‌ను ఆర్సీబీ సారథి విరాట్ కోహ్లీ రీ క్రియేట్ చేశాడు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఫీల్డింగ్ ప్రాక్టీస్ సెషన్‌లో అచ్చం ఏబీడీలానే బౌండరీ లైన్ వద్ద నిలబడి క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోను ఏబీడీ సూపర్ క్యాచ్‌తో పోలుస్తూ ఆర్సీబీ ట్వీట్ చేసింది. 'కెప్టెన్ కోహ్లీ మాములుగానే ఏబీ సూపర్‌మ్యాన్ క్యాచ్ రీక్రియేట్ చేశాడు. గత సాయంత్రం ప్రాక్టీస్ సెషన్‌లో ఇలా బంతిని అందుకున్నాడు' అని వ్యాఖ్య రాసుకొచ్చింది.

ఆర్సీబీ తన తొలి మ్యాచ్‌ సెప్టెంబరు 21(సోమవారం) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది.

ఇదీ చూడండి చెన్నై సూపర్​కింగ్స్​కు రైనా ఆల్​ది బెస్ట్

ABOUT THE AUTHOR

...view details