విరాట్ కోహ్లీ.. అసామాన్య ప్రతిభకు నిదర్శనం.. నేటితో 31 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లీ తన క్రికెట్ కెరీర్లో ఎన్నో రికార్డులు వశం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ సారథి పాంటింగ్, దక్షిణాఫ్రికా మాజీ ఆల్రౌండర్ కలిస్ లాంటి దిగ్గజాలు ఈ వయసుకు అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కంటే వెనుకంజలోనే ఉండటం గమనార్హం.
31 ఏళ్లకు విరాట్ అన్ని అంతర్జాతీయ మ్యాచ్ల్లో 57 సగటుతో మొత్తం 21 వేల 36 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. అతడి కంటే ముందు లిటిల్ మాస్టర్ సచిన్ తెందూల్కర్ ఉన్నాడు. 31 ఏళ్ల వయసుకు.. సచిన్ 49.1 సగటుతో 23వేల 776 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ తర్వాతి స్థానాల్లో పాంటింగ్(18,858), కలిస్(18,030), డివిలియర్స్ (17,882) ఉన్నారు.
ఏటా పెరుగుతున్న పరుగుల ప్రవాహం..