తెలంగాణ

telangana

ETV Bharat / sports

అలా వికెట్​ కీపర్​గా మారాల్సి వచ్చింది: కోహ్లీ - కోహ్లీ లేటెస్ట్​ న్యూస్​

2015లో బంగ్లాదేశ్​తో జరిగిన వన్డే మ్యాచ్​లో కొన్ని ఓవర్ల పాటు వికెట్​ కీపింగ్​ చేశాడు టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ. తాను కీపర్​గా మారడానికి గల పరిస్థితులను తాజాగా ఓ చాట్​ సెషన్​లో వివరించాడు. ధోనీలా ఒకేసారి కీపింగ్​తో పాటు ఫీల్డింగ్​ సెట్​ చేయడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు విరాట్.

Virat Kohli recalls the moment when MS Dhoni asked him to keep wickets
అలా వికెట్​ కీపర్​గా మారాల్సి వచ్చింది: కోహ్లీ

By

Published : Jul 29, 2020, 5:25 AM IST

బంగ్లాదేశ్​తో 2015లో జరిగిన మ్యాచ్​లో వికెట్​ కీపర్​ పాత్ర పోషించినప్పటి పరిస్థితులను తాజాగా గుర్తుచేసుకున్నాడు టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ. ఆ మ్యాచ్​లో కీపర్​గా వ్యవహరిస్తున్న ధోనీ.. అత్యవసరంగా బాత్రూమ్​కు వెళ్లిన సందర్భంలో అతని స్థానంలో కోహ్లీ కీపింగ్​ చేశాడు. ఆనాడు జరిగిన సంఘటనను మయాంక్​ అగర్వాల్​తో జరిగిన చాట్​ సెషన్​లో తాజాగా వెల్లడించాడు విరాట్​.

"​అలా ఎలా జరిగిందో ఒకసారి మహీ భాయ్​ని అడగండి. దయచేసి రెండు ఓవర్లు కీపర్​గా ఉండు అన్నాడు. అతని పరిస్థితిని అర్థం చేసుకున్న నేను కీపర్​గా ఉంటూనే ఫీల్డింగ్​ను సెట్​ చేశా. ఇలా ఒకేసారి రెండు పనులపై ధోనీ ఎలా దృష్టి సారించేవాడో అప్పుడే నాకు అర్థమైంది. నేను వికెట్​ కీపింగ్​ చేసే క్రమంలో ఉమేశ్​ యాదవ్​ బౌలింగ్​ చేస్తున్నాడు. అప్పుడు ఆ బంతి నా ముక్కుకు తగలవచ్చని భయపడ్డా. అలా జరిగితే అవమానకరంగా ఉంటుందని భావించి హెల్మెట్​ ధరించాలని అనుకున్నా. కానీ, హెల్మెట్​ ధరించలేకపోయా".

-విరాట్​ కోహ్లీ, టీమ్​ఇండియా కెప్టెన్​

మయాంక్​ అగర్వాల్​తో జరిగిన చాట్​షో ముందు ఎపిసోడ్​లో టెస్టు క్రికెట్​లో ఆటను డ్రాగా ముగించడం తన ఎంపిక కాదని విరాట్​ కోహ్లీ తెలిపాడు. ఎందుకంటే ఎలాంటి పరిస్థితిలోనైనా తాను రాజీపడబోనని వెల్లడించాడు. చివరి రోజున 10 వికెట్లు చేతిలో ఉండి జట్టు 300 పరుగులు చేయాల్సి ఉన్నా.. తాను ఎప్పుడూ డ్రా దిశగా మొగ్గుచూపనని స్పష్టం చేశాడు.

ABOUT THE AUTHOR

...view details