టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ, మైదానంలో ఉన్నట్లే సోషల్ మీడియాలోనూ చురుగ్గా వ్యవహరిస్తున్నాడు. సహచర, మాజీ క్రికెటర్ల కామెంట్లకు తనదైన రీతిలో సమాధానమిస్తున్నాడు. ఇలాంటి అనుభవమే ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌కు ఇప్పుడు ఎదురైంది.
'కోహ్లీ బైక్ ఎక్కి వచ్చేయ్.. ఇద్దరం చేద్దాం' - కోహ్లీ వార్తలు
కెప్టెన్ కోహ్లీ, ఇంగ్లాండ్ క్రికెటర్ పీటర్సన్లా మధ్య ఇన్‌స్టా వేదికగా సరదా సంభాషణ జరిగింది. దీనిని చూసిన అభిమానులు తెగ లైకులు కొడుతున్నారు.
కోహ్లీ పీటర్సన్
లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉన్న కోహ్లీ.. జిమ్‌లో చెమట చిందిస్తున్నాడు. ఈ క్రమంలో 'పవర్స్నాచ్' ఎక్సర్సైజ్ చేసిన ఓ వీడియోను పంచుకున్నాడు. "తనకు చాలా ఇష్టమైన వ్యాయామం ఇది" అని రాసుకొచ్చాడు. దీనిపై స్పందించిన పీటర్సన్.. బైక్ ఎక్కి వచ్చేయ్ ఇద్దరం కలిసి చేద్దామని కామెంట్ పెట్టాడు. ప్రతిగా విరాట్.. రిటైర్మెంట్ తర్వాత వస్తాలే అని తెలిపాడు.
ఇవీ చదవండి: