టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో పలు రికార్డులు కొల్లగొట్టాడు. ఈ ఫార్మాట్లో 7000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అదే విధంగా టెస్టుల్లో తన ఏడో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో టెస్టుల్లో బ్రాడ్‌మన్(6996) పరుగుల రికార్డును అధిగమించాడు భారత సారథి.
ఒకేసారి రెండు ఘనతలు అందుకున్న కోహ్లీ - kohli centuries
పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. పలు రికార్డులు నమోదు చేశాడు. ఈ ఫార్మాట్లో 7వ ద్విశతకం చేసి, 7000 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.
![ఒకేసారి రెండు ఘనతలు అందుకున్న కోహ్లీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4718670-122-4718670-1570783250402.jpg)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ
పుణె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్.. భారీస్కోరు దిశగా సాగుతోంది. క్రీజులో విరాట్‌తో పాటు రవీంద్ర జడేజా ఉన్నాడు. వికెట్లు తీసేందుకు సఫారీ బౌలర్లు శ్రమిస్తున్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది కోహ్లీసేన.
ఇది చదవండి: దిగ్గజాల సరసన కోహ్లీ... నాలుగో స్థానం కైవసం