ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సామాజిక మాధ్యమాల్లోని అధికార ఖాతాల ప్రొఫైల్ ఫొటోలు డిలీట్ చేసింది. దీనిపై తాజాగా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఈ విషయంపై ఫ్రాంఛైజీ తనకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
"కెప్టెన్‌కు తెలియకుండా ఆర్సీబీ ఖాతాలోని పోస్ట్‌లు ఎలా మాయమయ్యాయి. మీకెమైనా సహాయం కావాలా చెప్పండి..?" అని ట్విట్టర్లో కోహ్లీ స్పందించాడు.
సర్ప్రైజ్ కోసం వేచి ఉండండి..
ఆర్సీబీ తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో ఫొటోలను డిలిట్ చేసి.. జట్టు పేరును రాయల్ ఛాలెంజర్స్‌గా మార్పు చేసింది. ఇది జరిగిన 35 గంటల తర్వాత ఫ్రాంఛైజీ మరో సమాచారాన్ని పోస్ట్ చేసింది. ఓ సర్ప్రైజ్ కోసం అభిమానులు వేచి ఉండాలని కోరింది. దానితో పాటు అన్ని సామాజిక మాధ్యమాల ప్రొఫైల్ ఫొటోలు అప్డేట్ అవుతున్నట్టు తెలిపే చిత్రాలను అందులో ఉంచింది.
ఆర్సీబీ మంగళవారం ముత్తూట్ ఫిన్‌కార్ప్‌తో టైటిల్ స్పాన్సర్ కోసం మూడేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంది. ఇది జరిగిన మరుసటి రోజే ఇలా సామాజిక మాధ్యమాల్లో మార్పులు జరగడం చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చూడండి.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్‌ను వీడుతోందా..!