తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీకి బాగా ఇష్టమైన ఎక్సర్​సైజ్​ ఇదే - kohli latest news

స్టార్ క్రికెటర్, భారత సారథి కోహ్లీ.. తనకెంతో ఇష్టమైన ఎక్సర్​సైజ్​ గురించి అభిమానులతో పంచుకున్నాడు. దీనిని ప్రతిరోజూ చేసేందుకు ఇష్టపడతానని పేర్కొన్నాడు.

కోహ్లీకి బాగా ఇష్టమైన ఎక్సర్​సైజ్​ ఇదే
టీమ్​ఇండియా కెప్టెన్ కోహ్లీ

By

Published : Jul 4, 2020, 5:41 AM IST

లాక్​డౌన్​తో ఇంట్లోనే ఉన్న టీమ్​ఇండియా కెప్టెన్ కోహ్లీ.. సొంత జిమ్​లో చెమట చిందిస్తున్నాడు. ఈ క్రమంలో హార్దిక్​ పాండ్యలా 'పుష్​ అప్స్' చేసిన విరాట్.. ఇప్పుడు తనకెంతో ఇష్టమైన ఎక్సర్​సైజ్​ చేసి చూపించాడు. అందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్​లో పంచుకున్నాడు. "ప్రతిరోజూ ఏదైనా ఓ ఎక్సర్​సైజ్ చేయాలని అనుకుంటే దీనినే చేస్తా. లవ్​ ద పవర్​స్నాచ్" అని రాసుకొచ్చాడు.

ముంబయిలో తన భార్య అనుష్క శర్మతో కలిసి ఉంటున్న కోహ్లీ.. ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉన్నాడు. మధ్యమధ్యలో సహచర క్రికెటర్లతో లైవ్​చాట్​లో పాల్గొని పలు ఆసక్తికర విశేషాలను చెబుతున్నాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details