ఐపీఎల్ కోసం ఆటగాళ్లు చెమట చిందిస్తున్నారు. కరోనా కారణంగా కొన్ని నెలలుగా ఆటకు దూరమైన వీరు కసరత్తులు చేస్తూ ఫిట్నెస్ను కాపాడుకున్నారు. ఐపీఎల్ కోసం ఇటీవలే మళ్లీ బ్యాట్ పట్టి ప్రాక్టీస్ చేస్తున్నారు. యూఏఈలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆటగాళ్లు బాగా కష్టపడుతున్నారు. నెట్స్‌లో చెమట చిందిస్తున్నారు. సారథి విరాట్ కోహ్లీ కూడా హార్డ్ హిట్టింగ్ సెషన్‌తో లీగ్‌లో సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడు కోహ్లీ.
'హార్డ్ హిట్టింగ్ నెట్ సెషన్.. తర్వాత చిల్లింగ్' - విరాట్ కోహ్లీ ఐపీఎల్
ఐపీఎల్ కోసం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ సిద్ధమవుతోంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో ఆటగాళ్లు నెట్స్‌లో చెమట చిందిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేశాడు విరాట్.
!['హార్డ్ హిట్టింగ్ నెట్ సెషన్.. తర్వాత చిల్లింగ్' 'హార్డ్ హిట్టింగ్ నెట్ సెషన్.. తర్వాత చిల్లింగ్'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8665194-449-8665194-1599131776178.jpg)
ఈ ఫొటోలను ట్విట్టర్లో పంచుకుని "సరైన ప్రాక్టీస్, సరైన ఉక్కపోత, సరైన రికవరీ ఇవన్నీ కలిస్తే సంతోషం" అని క్యాప్షన్ ఇచ్చాడు కోహ్లీ. దాన్ని ఆర్సీబీ రీట్వీట్ చేస్తూ.. ముందుండి నడిపిస్తున్నాడని వ్యాఖ్యానించింది. అభిమానులూ కామెంట్లు పెడుతూ ఈసారి బెంగళూరుదే గెలుపంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
లాక్‌డౌన్ కన్నా ముందు విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లాడు. అక్కడ దారుణంగా విఫలమయ్యాడు. ఒక్క టీ20 తప్ప మిగతా ఏ మ్యాచ్‌లోనూ సరైన పరుగులు చేయలేకపోయాడు. దీంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. 2014 ఇంగ్లాండ్ పర్యటన తర్వాత టీమ్‌ఇండియా సారథి అంత ఘోరంగా విఫలమవ్వడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బాగా కష్టపడుతున్నాడు.