తెలంగాణ

telangana

ETV Bharat / sports

బుడగలో మళ్లీ ఉండాలంటే కష్టమే: కోహ్లీ

బయోబబుల్​లో ఎక్కువ రోజులు ఉంటే ఆటగాళ్లకు కష్టమని చెప్పిన కోహ్లీ.. ఆస్ట్రేలియా పర్యటన గడువుపై మరోసారి పునరాలోచించుకోవాలని బోర్డును కోరాడు.

Virat Kohli Points Out Impact of Staying in Bio-Bubble on Players Mentally
మళ్లీ అందులోనే ఉండాలంటే కష్టమే: కోహ్లీ

By

Published : Nov 6, 2020, 3:00 PM IST

ఐపీఎల్​ ప్లేఆఫ్స్​కు సిద్ధమైన బెంగళూరు జట్టు కెప్టెన్​ కోహ్లీ.. బయో బబుల్​పై కీలక వ్యాఖ్యలు చేశాడు. చాలారోజుల పాటు అందులో ఉండడం ఆటగాళ్లకు కష్టమేనని అన్నాడు. ఈ లీగ్ కోసం గత రెండు నెలలుగా బుడగలోనే ఉన్న అన్ని జట్లలోని భారత ఆటగాళ్లు.. త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో సిరీస్​ గడువుపై పునరాలోచించాలని విరాట్ బోర్డుకు విజ్ఞప్తి చేశాడు.

"బబుల్​లో అందరం బాగా గడిపాం. కానీ, చాలాసార్లు అందులోనే ఉండాల్సి వస్తే మాత్రం కష్టంగానే ఉంటుంది. సిరీస్​ గడువు పెంచడం, 80 రోజులుగా ఒకే వాతావరణంలో ఉంటే మానసికంగా ఎలాంటి ప్రభావం పడుతుందనే విషయాలు ఆలోచించాలి. లేదా ఆటగాళ్లకు తమ కుటుంబాలను కలిసేందుకు అవకాశాన్ని ఇవ్వాలి. ఇలాంటి చర్యలు తీసుకుని ఆటగాళ్లు మానసికంగా దృఢంగా ఉండేలా చూడాలి"

--కోహ్లీ, టీమ్ ఇండియా కెప్టెన్​

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తలో మూడు వన్డే, టీ20​లు, నాలుగు టెస్టులు ఆడనుంది భారత్. నవంబర్​ 27 నుంచి జనవరి 19 వరకు ఈ మ్యాచ్​లు జరగనున్నాయి.

ఇదీ చూడండి:అలా చేస్తే కోహ్లీ మరింతగా రెచ్చిపోతాడు: స్టీవ్ వా

ABOUT THE AUTHOR

...view details