దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో డబుల్ సెంచరీ(254)తో అదరగొట్టాడు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ. ఫలితంగా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మరోసారి అగ్రస్థానానికి చేరువయ్యాడు. మొదటి ర్యాంకులో ఉన్న ఆసీస్ ఆటగాడు స్మిత్‌కు విరాట్‌కు కేవలం ఒక పాయింట్ మాత్రమే తేడా ఉంది. మొదటి టెస్టు తర్వాత 900 పాయింట్ల దిగువకు పడిపోయిన కోహ్లీ రెండో మ్యాచ్‌లో సత్తాచాటడం వల్ల 936 పాయింట్లకు చేరుకున్నాడు.
రెండు టెస్టుల్లోనూ సెంచరీతో అదరగొట్టిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ టాప్-20లో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం 17వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇతడితో పాటు పుజారా (4), రహానే (9) టాప్-10లో ఉన్నారు.