భారతీయ అథ్లెట్లకు ఫిట్నెస్ చాలా ముఖ్యమని దాని కోసం కష్టపడాలని సూచించాడు విరాట్ కోహ్లీ. ఇందుకోసం శాకాహారం బాగా ఉపయోగపడుతుందని చెప్పాడీ స్టార్ బ్యాట్స్‌మెన్. మాంసాహారం తినడం వల్ల క్రీడాకారుల సామర్థ్యం పెరుగుతుందని అంతా భావిస్తారు. అదంతా అపోహ అని పేర్కొన్నాడు కోహ్లీ. తన ఆహారపు అలవాట్లు మారిన తర్వాతే ఆట తీరు మెరుగైందని చెప్పుకొచ్చాడీ రన్‌మెషీన్. తాజాగా దానిపై ఓ ట్వీట్‌నూ చేశాడు.
" నెట్‌ఫ్లిక్స్‌లో గేమ్ ఛేంజర్స్ అనే డాక్యుమెంటరీ చూశాను. శాకాహారిగా ఉన్న నాకు అది ఎంతో పాఠం నేర్పింది. ఇన్ని రోజులు డైట్ విషయంలో నేను పాటించే విషయాలు తప్పని తెలుసుకున్నా.గతంలో మాంసాహారిగా ఉన్నప్పుడు ఇప్పుడున్నంత ఉత్తమంగా ఫీలవ్వలేదు".
-- విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి
'ద గేమ్ ఛేంజర్స్' పేరుతో నెట్‌ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. ఇందులో ఓ ఇంగ్లీష్ మార్షల్ ఆర్టిస్ట్ మాంసం, ప్రోటీన్లు, బలం వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల వ్యక్తులను కలిసి ఓ అధ్యయనం చేస్తాడు.