రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ ప్రతిభ, పట్టుదలకు రికార్డులు దాసోహమంటున్నాయి. ఇప్పటికే అరుదైన ఘనతలు సాధించిన టీమిండియా కెప్టెన్, దశాబ్ద కాలంలో వేగంగా 20 వేల అంతర్జాతీయ పరుగుల మైలురాయిని అధిగమించిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. పదేళ్ల కాలంలోనే అతడి పరుగుల ప్రవాహానికి పాత రికార్డులు కొట్టుకుపోతున్నాయి.
2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ.. 2010 నుంచి ఇప్పటివరకు 20,688(వన్డే, టెస్టు, టీ20లు కలిపి) పరుగులు చేశాడు. 380 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనే 20వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా 21,163 పరుగులు చేశాడు.
సచిన్ రికార్డు బ్రేక్..
సచిన్ తెందూల్కర్, విండీస్ దిగ్గజం బ్రియాన్ లారాలకు ఈ ఘనత సాధించడానికి 453 ఇన్నింగ్స్‌లు పట్టగా.. విరాట్ కోహ్లీ 417 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకున్నాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్కుృ 468 ఇన్నింగ్స్‌ల్లో 20వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.