తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీని నేనూ మిస్‌ అవుతున్నా: కోహ్లీ - ధోనీ కోహ్లీ

టీమ్ఇండియా మాజీ సారథి ధోనీని.. ప్రస్తుత కెప్టెన్​ కోహ్లీ మిస్​ అవుతున్నట్లు తెలియజేసిన వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది. కాగా, సిడ్నీ వేదికగా మంగళవారం ఆసీస్​-భారత్​ నామమాత్రపు మూడో టీ20 మ్యాచ్​లో తలపడనున్నాయి.

Virat kohli misses Dhoni
కోహ్లీ

By

Published : Dec 8, 2020, 6:45 AM IST

టీమ్​ఇండియా మాజీ సారథి ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా.. అతడి గురించి మైదానంలో, వెలుపలా చర్చలు సాగుతూనే ఉన్నాయి. భారత్‌×ఆసీస్ మధ్య జరిగిన రెండో టీ20లోనూ ప్రత్యర్థి కెప్టెన్‌ మాథ్యూ వేడ్ సైతం ధోనీ మెరుపు వికెట్‌ కీపింగ్ నైపుణ్యాల గురించి శిఖర్‌ ధావన్‌తో మాట్లాడాడు. అంతేగాక భారత జట్టు పరాజయాలు చవిచూసినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు జట్టులో మహీ ఉంటే ఫలితం మరోలా ఉండేదని క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు అతడిని తరచూ జ్ఞాపకం చేసుకుంటుంటారు.

అలాగే సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లోనూ ధోనీని ఎంతో మిస్‌ అవుతున్నామని అభిమానులు ప్లకార్డులతో మైదానంలో ప్రదర్శించారు. అయితే ఆ సమయంలో బౌండరీ లైన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న భారత సారథి విరాట్ కోహ్లీ అభిమానులతో తాను కూడా మిస్‌ అవుతున్నాని తెలియజేస్తూ సంజ్ఞ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ కైవసం చేసుకుంది. మూడు టీ20ల సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ ఇదే వేదికగా మంగళవారం జరగనుంది.

ఇదీ చూడండి :ధోనీ, కోహ్లీ తర్వాత హార్దిక్ పాండ్యనే అలా!

ABOUT THE AUTHOR

...view details