టీమ్ఇండియా మాజీ సారథి ధోనీ హెలికాఫ్టర్ షాట్.. ప్రతి అభిమానికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే ఈ షాట్‌ను సైగలతో అనుకరించాడు సారథి కోహ్లీ. ప్రస్తుతం టీమ్ఇండియా.. ఫ్రిబవరి 5నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభంకానున్న టెస్టు సిరీస్ కోసం నెట్ ప్రాక్టీస్ చేస్తుంది. ఇందులో భాగంగా బుధవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది బీసీసీఐ. ఇందులో భారత ఆటగాళ్లు జోరుగా, ఉత్సాహంగా శిక్షణ చేస్తూ కనిపించారు. ఈ క్రమంలోనే కోహ్లీ.. మహీని గుర్తుకుతెస్తూ హెలికాఫ్ట్ర్ షాట్‌ను సైగలతో అనుకరించాడు. ఈ వీడియో వైరల్ అవ్వగా.. నెటిజన్లు విపరీతంగా లైక్స్ కొడుతూ కామెంట్లు పెడుతున్నారు.
షెడ్యూల్