తెలంగాణ

telangana

ETV Bharat / sports

2019లో మోస్ట్​ రీట్వీట్​​: 'నువ్వెప్పటికీ నా సారథివే'

టీమిండియా సారథి విరాట్​కోహ్లీ.. ఈ ఏడాది చేసిన ఓ ట్వీట్​ను అభిమానులు ఎక్కువగా రీట్వీట్​ చేశారు. ఇది ఈ సంవత్సరం ఎక్కువగా చర్చించిన స్పోర్ట్స్​ ట్వీట్​గా నిలిచింది. ఇందులో కోహ్లీ.. ధోనీకి పుట్టినరోజు చెబుతూ భావోద్వేగానికి లోనయ్యాడు.

Virat-Dhoni Tweet Was The Most Retweeted Sports Tweet of 2019
2019లో మోస్ట్​ రీట్వీట్​​: 'నువ్వెప్పటికీ నా సారథివే'..

By

Published : Dec 10, 2019, 5:09 PM IST

భారత క్రికెట్​ జట్టులో విరాట్​-ధోనీ జోడీకి విపరీతంగా అభిమానులు ఉంటారు. వీరిద్దరూ కలిసి బరిలోకి దిగితే ఏ దేశాన్నైనా ఓడించగల సత్తా ఉందని వీక్షకులు నమ్ముతారు. ప్రత్యర్థిపై ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఒకరు మిస్టర్​ కూల్​గా​ కనిపిస్తే... మరొకరు తనదైన ఆట, ఆవేశంతో మైదానంలో తోటి క్రికెటర్లలో స్ఫూర్తిని రగిలిస్తాడు​​. అలాంటి ఈ ద్వయం మైదానంలో కనిపిస్తేనే వీక్షకులు గోల చేస్తారు. మరి భావోద్వేగంతో ట్వీట్​ చేస్తే ఊరుకుంటారా? ప్రతి ఒక్కరూ కనెక్ట్​ అవుతారు. అందుకే కోహ్లీ ఈ ఏడాది చేసిన ఓ ట్వీట్​ను.. అత్యధికంగా రీట్వీట్​ చేశారు. ఫలితంగా ఇది 2019 టాప్​ స్పోర్ట్స్​ ట్వీట్​గా నిలిచింది.

ధోనీ పుట్టినరోజు సందర్భంగా ఫొటో, కొన్ని మాటలను జతచేర్చి ట్వీట్​ చేశాడు విరాట్​ కోహ్లీ. అందులో మహీతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు.

" హ్యాపీ బర్త్​డే మహీ భాయ్​.. కొద్ది మంది మాత్రమే నమ్మకం, గౌరవాన్ని అర్థం చేసుకోగలరు. ఇన్నేళ్ల పాటు నీతో స్నేహం చేస్తూ కొనసాగిన నా ప్రయాణాన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నా. మా అందరికీ నువ్వు ఒక పెద్ద అన్నలాంటివాడివి. అంతేకాదు నువ్వు నాకెప్పటికీ కెప్టెన్​వే"
-- విరాట్​ కోహ్లీ, భారత జట్టు సారథి

కోహ్లీ ట్వీట్​

వెస్టిండీస్​​తో మూడో టీ20 కోసం సిద్ధమవుతున్నాడు కెప్టెన్ విరాట్​. ఈ ​ బుధవారం ముంబయి వేదికగా ఈ మ్యాచ్​ జరగనుంది. ఇప్పటికే మూడు మ్యాచ్​ల సిరీస్​ 1-1తో సమమైంది.

ఇటీవలే ధోనీ రీఎంట్రీ గురించి మాట్లాడాడు టీమిండియా ప్రధాన కోచ్​ రవిశాస్త్రి. వచ్చే ఏడాది ఐపీఎల్​లో ఆడతాడని ఆ తర్వాత ఫిట్​గా ఉంటే భారత జట్టులోకి వస్తాడని అభిప్రాయపడ్డాడు.

ప్రపంచకప్​లో న్యూజిలాండ్​తో జరిగిన సెమీఫైనల్లో మహీ చివరగా ఆడాడు. ఆ టోర్నీ ముగిసిన తర్వాత పారా మిలటరీ దళంతో కలిసి పనిచేశాడు. అనంతరం వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్​ సిరీస్​లకు దూరంగా ఉన్నాడు.

ABOUT THE AUTHOR

...view details