తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ బ్రాండ్ విలువ 1690 కోట్లు - rohit sharma brand value

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ బ్రాండ్ విలువ మరింత పెరిగింది. ప్రస్తుతం రూ.1690 కోట్ల బ్రాండ్​ విలువతో భారత్​లో అత్యధిక విలువ గల సెలబ్రిటీగా నిలిచాడు.

కోహ్లీ
కోహ్లీ

By

Published : Feb 6, 2020, 7:32 AM IST

Updated : Feb 29, 2020, 8:59 AM IST

భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వరుసగా మూడో ఏడాది భారత్‌లో అత్యధిక బ్రాండ్‌ విలువ గల సెలబ్రిటీగా నిలిచాడు. 'ద డఫ్‌ అండ్‌ ఫెల్ప్స్‌ 'అనే సంస్థ అధ్యయనం ప్రకారం రూ.1690 కోట్ల బ్రాండ్‌ విలువతో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్‌ శర్మ (రూ.163 కోట్లు) కన్నా విరాట్ బ్రాండ్‌ విలువ పది రెట్లు ఎక్కువ.

రూ.743 కోట్లతో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ రెండో స్థానంలో ఉన్నాడు. 2019లో కోహ్లీ బ్రాండ్‌ విలువ 39 శాతం పెరిగింది. అత్యధిక బ్రాండ్‌ విలువ గల భారత ప్రముఖుల జాబితాలో టాప్‌-20లో కోహ్లీ సహా నలుగురు క్రికెటర్లు ఉన్నారు. ధోనీ (రూ.293 కోట్లు) 9వ స్థానంలో ఉన్నాడు. 2018లో 12వ స్థానంలో ఉన్న అతడు మూడు స్థానాలు ఎగబాకాడు. రిటైరైనప్పటికీ సచిన్‌ తెందూల్కర్‌ శక్తివంతమైన బ్రాండే. రూ.153 కోట్లతో అతడు 15వ స్థానంలో నిలిచాడు. రోహిత్‌ 20వ స్థానంలో ఉన్నాడు.

ధోనీ, సచిన్, రోహిత్

ఇవీ చూడండి.. నాలుగో స్థానం బ్యాటింగ్​లో అతడే బాస్!

Last Updated : Feb 29, 2020, 8:59 AM IST

ABOUT THE AUTHOR

...view details