ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిటెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీలతో ఆకట్టుకున్న లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లు శార్దుల్ ఠాకూర్, సుందర్‌లపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లు తక్కువస్కోరుకే ఔటైనా పట్టుదలగా బ్యాటింగ్ చేసి జట్టు స్కోరును మూడోందలు దాటించిన ఈ జోడీపై తోటి క్రీడాకారులు, మాజీల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ మ్యాచ్ తొలిఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 336 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఆస్ట్రేలియాకు కేవలం 33 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. ఇంతకీ ఎవరెవరు ఏమని ట్వీట్ చేశారో చూద్దాం.
"టెస్టు క్రెకిట్లో ఉన్న అసలైన వినోదం ఇదే. ఠాకూర్, సుందర్‌లు అద్భుతంగా ఆడారు."