కరోనా కట్టడి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులను ప్రశంసించాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఈ విపత్కర పరిస్థితుల్లో పేదలకు వారు చేస్తున్న పనిని మెచ్చుకున్నాడు. ముఖ్యంగా దిల్లీ పోలీసులు రాత్రింబవళ్లు చేస్తున్న సేవలకుగాను అభినందించాడు.
"క్లిష్ట పరిస్థితుల్లోనూ సేవలు అందిస్తున్న దేశ పోలీసులకు నా అభినందనలు. లాక్డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తోన్న పేదలకు ఆహారం అందిస్తూ, నిజాయతీగా విధులు నిర్వహిస్తున్న దిల్లీ పోలీసుల సేవలు ప్రశంసనీయం. ఇలానే మీ సేవలను కొనసాగించండి"
-విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి