టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో సరికొత్త రికార్డు సృష్టించాడు. అత్యంత వేగంగా వన్డేల్లో 5000 పరుగులు చేసిన సారథిగా నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఈ ఘనత సాధించాడు. 82 వన్డేల్లో ఈ మార్క్‌ను చేరుకున్నాడు విరాట్. ఈ జాబితాలో కోహ్లీ తర్వాతి స్థానాల్లో ధోనీ(127), పాంటింగ్(131), గ్రేమ్ స్మిత్(135), సౌరభ్ గంగూలీ(136) ఉన్నారు.
కెప్టెన్‌గా సరికొత్త రికార్డు సృష్టించిన కోహ్లీ - rohit sharma
టీమిండియా సారథిగా వన్డేల్లో 5000 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు విరాట్ కోహ్లీ. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన వాడిగా నిలిచాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ
ఈ మ్యాచ్‌లో భారత్‌కు 287 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఆస్ట్రేలియా. ఛేదనలో టీమిండియా బ్యాట్స్‌మన్ ధాటిగా ఆడుతున్నారు. రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేశాడు. కోహ్లీ అర్ధ శతకం దిశగా సాగుతున్నాడు.