టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్.. నువ్వా నేనా అని పోడుతుంటారు. అయితే అంతర్జాతీయ క్రికెట్లో వీరిద్దరిలో ఎవరు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అంటూ క్రీడాభిమానులు చర్చిస్తుంటారు. తాజాగా జరిగిన భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఈ చర్చ.. మరోసారి తెరపైకి వచ్చింది. ఇందుకు సమాధానంగా ఓ శ్రీలంక విలేకరి.."అన్ని ఫార్మాట్లలో స్మిత్ గొప్ప బ్యాట్స్‌మన్" అంటూ ట్వీట్ చేశాడు. బదులుగా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్.. "దీనికి నేను ఒప్పుకోను. విరాట్ కోహ్లీనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్" అంటూ రీట్వీట్ చేశాడు.
'ఆ విషయం ఒప్పుకోను.. విరాట్ కోహ్లీనే గొప్ప' - india vs australia
ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో స్మిత్ కంటే భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీనే గొప్ప అని ట్వీట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ వాన్.
భారత్-ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1తో సొంతం చేసుకుంది. కోహ్లీ 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు. 3 మ్యాచుల్లో కలిపి విరాట్ 183 పరుగులు చేయగా, స్మిత్ 229 పరుగులతో సిరీస్ టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.
ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, స్మిత్ మధ్య అంతరం ఎంతో ఉంది. 886 పాయింట్లతో విరాట్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. స్మిత్ 683 పాయింట్లతో 23వ స్థానంలో ఉన్నాడు. కానీ టెస్టుల్లో కోహ్లీ 928 పాయింట్లతో, స్మిత్ 911 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.