తెలంగాణ

telangana

ETV Bharat / sports

కలిస్​, స్మిత్​ను అనుకరిస్తూ కోహ్లీ కామెడీ

మరోసారి తన చిలిపి చేష్టలతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు భారత కెప్టెన్ కోహ్లీ. దక్షిణాఫ్రికా క్రికెటర్​ కలిస్​ బౌలింగ్, ఆసీస్​ బ్యాట్స్​మెన్​ స్టీవ్​ స్మిత్​ బ్యాటింగ్​ను అనుకరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

Unmissable! Virat Kohli imitates Steve Smith’s batting, Jacques Kallis’ bowling action during training - WATCH
కలిస్​, స్మిత్​లను అనుసరించిన కోహ్లీ- వీడియో వైరల్​

By

Published : Feb 24, 2021, 5:04 PM IST

మైదానంలో ఎల్లప్పుడూ చురుకుగా ఉండే భారత కెప్టెన్ కోహ్లీ.. మరోసారి తన చిలిపి చేష్టలతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మూడో టెస్టుకు ముందు ప్రాక్టీస్​ సెషన్​ సందర్భంగా విరాట్​.. దక్షిణాఫ్రికా క్రికెట్​ దిగ్గజం, ఆల్​రౌండర్​ జాక్వస్​ కలిస్​లా బౌలింగ్​ చేశాడు. ఆసీస్ స్టార్​ బ్యాట్స్​మెన్ స్టీవ్​ స్మిత్​ బ్యాటింగ్​ను అనుకరించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరలైంది.

దాదాపు కలిస్​ బౌలింగ్​ శైలికి చాలా దగ్గరగా వచ్చాడు భారత కెప్టెన్. బ్యాటింగ్​ చేసిన అనంతరం స్మిత్ ఎలా ప్రవర్తిస్తాడో.. విరాట్​ చేసి చూపించాడు.

ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్​మెన్లలో ఒకడైన కోహ్లీ.. కెరీర్​ ఆరంభంలో పార్ట్​టైమ్​ బౌలింగ్​ చేసేవాడు. ప్రస్తుతం అతడి బ్యాటింగ్​ మీద మాత్రమే దృష్టి సారించాడు.

ఇదీ చదవండి:లెజెండ్స్​ క్రికెట్​ సిరీస్​కు​ షెడ్యూల్​ ఖరారు

ABOUT THE AUTHOR

...view details