తెలంగాణ

telangana

ETV Bharat / sports

వాణిజ్య ఒప్పందాల్లో క్రికెటర్ల జోరు - విరాట్​ కోహ్లీ బ్రాండ్​ విలువ

బాలీవుడ్​ సినీతారల కంటే క్రికెటర్లు వాణిజ్య ఒప్పందాల్లో జోరు చూపిస్తున్నారు. బ్రాండ్​ ప్రచారకర్తలుగా నటీనటులు అధికంగా ఉన్నా.. ఈ ఒప్పందాల విషయంలో క్రికెటర్లలో ఎదుగుదల కనిపిస్తుంది.

Virat Kohli hikes endorsement fee to Rs 5 crore/day, highest among Indian celebrities
వాణిజ్య ఒప్పందాల్లో క్రికెటర్ల జోరు

By

Published : Oct 22, 2020, 6:53 AM IST

వాణిజ్య ఒప్పందాల్లో బాలీవుడ్​ తారల కంటే క్రికెటర్ల జోరు ఎక్కువగా కనిపిస్తుంది. ఒప్పందాల విషయంలో సినీతారల సంఖ్య అధికంగానే ఉన్నా.. ఎదుగుదలలో మాత్రం క్రికెటర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది 21 మంది బాలీవుడ్​ తారలకు వాణిజ్య ఒప్పందాలు ఉండగా.. ఈ సారి ఆ సంఖ్య 30కి పెరిగింది. అయితే నిరుడు ఐపీఎల్​​లో నలుగురికి మాత్రమే వాణిజ్య ఒప్పందాలు ఉండగా.. ఈ ఏడాది 18 మందికి చేరుకుంది.

బాలీవుడ్​ వివాదాలు, ఐపీఎల్ కారణంగా క్రికెటర్ల క్రేజ్​ పెరిగిందని విశ్లేషకులు అంటున్నారు. ఐపీఎల్​-13లో వాణిజ్య ఒప్పందాల్లో 42 శాతం వాటాతో ధోనీ అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్​ కోహ్లీ, రిషబ్ పంత్​ 9 శాతం చొప్పున తర్వాత స్థానాల్లో ఉన్నారు. బ్రాండ్​ విలువలో మాత్రం కోహ్లీదే ప్రథమస్థానం. కోహ్లీ ఒక రోజుకు రూ.5 కోట్లు తీసుకుంటుండగా.. ధోనీ, రోహిత్​ శర్మలు రూ.1 కోటి నుంచి రూ.3 కోట్లు అందుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details