తెలంగాణ

telangana

ETV Bharat / sports

కొవిడ్​ నిబంధనలు అతిక్రమించిన కోహ్లీ, పాండ్యా! - కరోనా నిబంధనలు అతిక్రమించిన కోహ్లీ

ఆస్ట్రేలియాలో ఇటీవలే పలువురు టీమ్ఇండియా క్రికెటర్లు కరోనా నిబంధనలు అతిక్రమించారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్​ కోహ్లీ, హార్దిక్​ పాండ్యా కూడా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని ఆసీస్​ మీడియా సంస్థలు వెల్లడించాయి. దానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్​గా మారాయి.

Virat Kohli, Hardik Pandya also breached COVID protocols in Australia
కొవిడ్​ నిబంధనలను అతిక్రమించిన హార్దిక్​, కోహ్లీ!

By

Published : Jan 3, 2021, 5:56 PM IST

ఆస్ట్రేలియాలో కొవిడ్​ ఆంక్షలను అతిక్రమించారనే ఆరోపణల మధ్య ఐదుగురు టీమ్​ఇండియా ఆటగాళ్లను క్వారంటైన్ చేసినట్లు వార్తలొచ్చాయి. దీంతో నెటిజన్లు వారిపై తీవ్రంగా మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బయోబబుల్​ దాటి బయటకు వచ్చారని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ నేపథ్యంలో మరోవార్తతో టీమ్​ఇండియా శిబిరంలో కలవరం మొదలైంది. భారత కెప్టెన్​ విరాట్​ కోహ్లీ, ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్యా కూడా నిబంధనలను అతిక్రమించారనే ప్రచారం జరుగుతోంది. వాటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

కోహ్లీ, హార్దిక్​ పాండ్యాలు కలిసి డిసెంబరు 7న ఓ బేబిషాప్​నకు వెళ్లారని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరూ మాస్క్​ లేకుండా సంచరిస్తూ.. ఆస్ట్రేలియన్స్​తో కలిసి దిగిన ఫొటోలు వైరల్​ అయ్యాయి. అయితే ఈ విషయం గురించి అప్పట్లో ఎలాంటి చర్చ జరగలేదు. ఇటీవలే ఐదుగురు క్రికెటర్లు నిర్బంధంలోకి వెళ్లారనే ప్రచారం తర్వాత కోహ్లీ విషయం వెలుగులోకి వచ్చింది .

ఇదీచూడండి:ఐసోలేషన్‌కు ఐదుగురు టీమ్‌ఇండియా క్రికెటర్లు

ABOUT THE AUTHOR

...view details