టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ వివాహ బంధానికి శుక్రవారం నాటికి మూడేళ్లు ముగిశాయి. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా తన సతీమణికి శుభాకాంక్షలు తెలిపాడు విరాట్ కోహ్లీ. వివాహ సమయంలో అనుష్క నవ్వుతూ కనిపించే ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటో పోస్టు చేశాడు. ఆ పోస్ట్‌కు "కలకాలం కలిసుండే జంటకు పెళ్లై మూడేళ్లు ముగిసింది" అని క్యాప్షన్ ఇచ్చాడు.
3 ఏళ్లు.. త్వరలో ముగ్గురం
విరాట్ కోహ్లీ ట్వీట్‌కు స్పందించిన అనుష్క శర్మ.. తమ వివాహ బంధానికి మూడేళ్లు నిండడంపై సంతోషం వ్యక్తం చేసింది. 'మూడేళ్ల బంధం.. త్వరలో ముగ్గురం' అని తను తల్లి కాబోతున్న విషయాన్ని గుర్తుచేస్తూ సామాజిక మాధ్యమాల్లో కోహ్లీతో ఉన్న ఫొటో పోస్టు చేసింది. కోహ్లీని బాగా మిస్ అవుతున్నట్లు పేర్కొంది.
అనుష్క శర్మ పోస్ట్ చేసిన ఫొటో
జనవరిలో అనుష్క పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న నేపథ్యంలో విరాట్ పితృత్వ సెలవులు తీసుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విరాట్.. టెస్టు సిరీస్ మొదటి మ్యాచ్ అనంతరం భారత్‌కు రానున్నాడు.
ఇదీ చదవండి:'పంత్ పర్యటకుడిలా వెళ్లినట్లు ఉన్నాడు'