ఐపీఎల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ కోహ్లీ సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే అతడి కొత్త కిట్ తీసుకున్నాడు. ఆ ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశాడు. ఇదే విషయాన్ని చెబుతూ.. కెప్టెన్ కోహ్లీ ఆయుధాలు వచ్చేశాయని ఆర్సీబీ ట్వీట్ చేసింది.
ఐపీఎల్ కోసం కోహ్లీ కొత్త అస్త్రాలు సిద్ధం - కోహ్లీ ఐపీఎల్ 2020
ఐపీఎల్ కోసం కోహ్లీ కొత్త కిట్ సిద్ధమైపోయింది. ఈ విషయమై ట్వీట్ చేసిన ఆర్సీబీ.. కెప్టెన్ ఆయుధాలు వచ్చేశాయని పేర్కొంది.
కోహ్లీ
కరోనా ప్రభావంతో ఈ ఏడాది ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించనున్నారు. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10వ తేదీ వరకు జరగనుంది.
ఇప్పటివరకు జరిగిన 12 సీజన్లలో బెంగళూరు జట్టు ఒక్కసారైనా కప్పు గెలుచుకోలేకపోయింది. ఈసారి మాత్రం ఎలాగైనా సరే విజేతగా నిలవాలని భావిస్తోంది. మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కూడా ఇదే చెప్పాడు. యూఏఈ పిచ్‌లు ఆర్సీబీ బౌలర్లకు బాగా ఉపకరిస్తాయని అన్నాడు. ఈ జట్టుకే కప్పు గెలిచే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డాడు.