ఆస్ట్రేలియా దెబ్బకి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు చేరింది. వాంఖడేలో మంగళవారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓడింది. గత 15 ఏళ్లలో భారత్ ఆడిన వన్డేల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఆస్ట్రేలియా చేతిలో పరాభవం చెందడం చరిత్రలో ఇదే మొదటిసారి.
అంతకు ముందు న్యూజిలాండ్(1981), వెస్టిండీస్(1997), దక్షిణాఫ్రికా(2000, 2005) చేతిలో టీమిండియా 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.