విరాట్ కోహ్లీ.. ఈ పేరు ప్రస్తుతం ఓ సెన్సేషన్. అతడికి సహచరులతో పాటు బయట లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు. వీరిలో చాలా మంది అతడి వస్త్రధారణ, కేశాలంకరణ వంటి అంశాలను అనుకరిస్తూ కనిపిస్తుంటారు. అయితే ఆస్ట్రేలియాతో తొలి వన్డే సందర్భంగా చిరాగ్ కిలారే అనే ఓ అభిమాని వినూత్నంగా దర్శనమిచ్చాడు. తన తల వెనక విరాట్ ముఖాన్ని తలపించేలా జుత్తు కత్తిరించుకున్నాడు. ఈ ఫొటో ప్రస్తుతం వైరల్గా మారింది.
చాలా సంవత్సరాల నుంచి విరాట్ ఆడే ప్రతి మ్యాచ్కు వెళ్తున్నానని, భారత్ అండర్-19 జట్టుకు కెప్టెన్ అయినప్పటి నుంచే కోహ్లీని అభిమానిస్తున్నానని చెప్పాడు చిరాగ్. తన జుత్తును ఇలా కత్తిరించుకునేందుకు సుమారు 6-8 గంటలు పడుతుందని అన్నాడు. అయితే ఇంతవరకు అతడిని కలిసే అవకాశం రాలేదని చెప్పాడు.