తమ ఆరాధ్య క్రికెటర్లను కలుసుకోవాలని, ఒక్కసారైనా ముట్టుకోవాలని ప్రయత్నిస్తుంటారు కొందరు వీరాభిమానులు. ఈ క్రమంలోనే మ్యాచ్ జరుగుతున్నప్పుడు బారికేడ్లు దాటి, మైదానంలోకి ప్రవేశిస్తుంటారు. భారత్-న్యూజిలాండ్ నాలుగో టీ20 సందర్భంగా ఇలాంటిదే ఓ సంఘటన జరిగింది. కోహ్లీని కలిసేందుకు ఇద్దరు అభిమానులు(వేరువేరుగా) మైదానంలోకి వెళ్లారు. వారిని పట్టుకునేందుకు మైదాన సిబ్బంది ఆపసోపాలు పడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
న్యూజిలాండ్‌లోనూ కోహ్లీ కోసం ఆగట్లేదు! - భారత్-న్యూజిలాండ్ నాలుగో టీ20
భారత్-న్యూజిలాండ్ నాలుగో టీ20 జరుగుతుండగా, కోహ్లీని కలిసేందుకు ఇద్దరు అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు. విరాట్ కోసం స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఇలాంటి సంఘటన జరగడం విశేషం.
![న్యూజిలాండ్‌లోనూ కోహ్లీ కోసం ఆగట్లేదు! న్యూజిలాండ్‌లోనూ కోహ్లీ కోసం ఆగట్లేదు!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5928737-840-5928737-1580617718518.jpg)
విరాట్ కోహ్లీ
సూపర్ ఓవర్‌కు దారితీసిన ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. సిరీస్‌లో 4-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. చివరి టీ20.. బే ఓవల్ మైదానంలో ఈ రోజు మధ్యాహ్నం జరగనుంది. ఇందులోనూ గెలిచి కివీస్‌ను వైట్‌వాష్ చేయాలని భారత్ చూస్తుండగా, పరువు నిలుపుకోవాలని భావిస్తోంది ఆతిథ్య న్యూజిలాండ్.
Last Updated : Feb 28, 2020, 8:50 PM IST