తెలంగాణ

telangana

ETV Bharat / sports

సచిన్​, పాంటింగ్ రికార్డులపై కోహ్లీ చూపు

ఆస్ట్రేలియాతో రేపు రాజ్​కోట్ వేదికగా రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్​లో సెంచరీ సాధిస్తే కోహ్లీ రెండు రికార్డులు తన ఖాతాలో వేసుకోవచ్చు.

virat
కోహ్లీ

By

Published : Jan 16, 2020, 5:07 PM IST

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో పరాజయంపాలైంది టీమిండియా. సిరీస్​లో నిలవాలంటే కచ్చితంగా రెండో మ్యాచ్ గెలవాల్సిందే. ఈ మ్యాచ్​లో కోహ్లీని రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. చివరి వన్జేలో 16 పరుగులే చేసి నిరాశపర్చిన విరాట్​.. రేపటి మ్యాచ్​లో సెంచరీ చేస్తే రెండు రికార్డులు ఖాతాలో వేసుకుంటాడు.

పాంటింగ్ రికార్డు

అంతర్జాతీయ క్రికెట్​లో అన్ని ఫార్మాట్లలో కలిసి కెప్టెన్​గా కోహ్లీ 41 సెంచరీలు చేశాడు. ప్రస్తుతం ఆసీస్ దిగ్గజ ఆటగాడు పాంటింగ్​తో కలిసి సమంగా ఉన్నాడు. రెండో వన్డేలో సెంచరీ సాధిస్తే ఇతడిని దాటేసి ముందుకెళతాడు. పాంటింగ్, కోహ్లీ తర్వాతి స్థానంలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్రేమ్ స్మిత్ (33) ఉన్నాడు.

సచిన్ రికార్డు

ఆస్ట్రేలియాపై వన్డేల్లో కోహ్లీ ఇప్పటివరకూ చేసిన సెంచరీల సంఖ్య 8. తొమ్మది సెంచరీలతో సచిన్​ ఇతడికంటే ముందున్నాడు. ఆసీస్‌పై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత క్రికెటర్‌గా సచిన్​తో కలిసి అగ్రస్థానంలో నిలవడానికి కోహ్లీ సెంచరీ దూరంలో ఉన్నాడు.

ఇవీ చూడండి.. బంతి ఇప్పుడు ధోనీ కోర్టులో.. నిర్ణయం ఎటువైపో..!

ABOUT THE AUTHOR

...view details