టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుస పెట్టి రికార్డులు అందుకుంటున్నాడు. తాజాగా మరో ఘనతకు అడుగు దూరంలో ఉన్నాడు. సారథిగాటెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో రికీ పాంటింగ్ రెండో స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్‌తో సిరీస్‌లో ఒక్క శతకం చేస్తే ఆసీస్ మాజీ కెప్టెన్‌ను సమం చేస్తాడు విరాట్ కోహ్లీ.
కెప్టెన్‌గా రికీ పాంటింగ్ 19 శతకాలు చేశాడు. ఇప్పటికే 18 సెంచరీలు సాధించిన విరాట్.. గురువారం నుంచి ఆరంభం కానున్న విండీస్ టెస్టు సిరీస్‌లో ఈ ఘనత అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. సారథిగా అత్యధిక శతకాలు చేసిన క్రికెటర్లలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్రేమ్ స్మిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. 109 టెస్టుల్లో 25 శతకాలతో ముందున్నాడు. ఇందులో స్మిత్‌కు విదేశాల్లోనే 17 సెంచరీలు ఉన్నాయి.