తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెస్టుల్లోని తీవ్రత ఇతర ఫార్మాట్​లలో కష్టం: కోహ్లీ - kohli test cricket

ఐదు రోజుల ఫార్మాట్​లో ఉన్నంత తీవ్రత, మిగిలిన వాటిలో ఉండదని తెలిపాడు కెప్టెన్ కోహ్లీ. భారత్​ తరఫున టెస్టుల్లో పాల్గొనడం తన అదృష్టమని రాసుకొచ్చాడు.

టెస్టు క్రికెట్​ ఆడుతుండటం నిజంగా అదృష్టం: కోహ్లీ
విరాట్ కోహ్లీ

By

Published : Jun 25, 2020, 8:53 AM IST

టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. టెస్టు ఫార్మాట్​పై తనకున్న ఇష్టాన్ని వెల్లడించాడు. తెలుపు దుస్తుల్లో ఆడినప్పుడు ఆటలో తీవ్రత మరోలా ఉంటుందని, భారత్​ తరఫున టెస్టుల్లో పాల్గొనడం తన అదృష్టమని అన్నాడు. అందుకు సంబంధించిన పాత ఫొటోలను ఇన్​స్టాలో పంచుకుని ఆనందం వ్యక్తం చేశాడు.

స్పందించిన అభిమానులు.. 'కింగ్ కోహ్లీ', 'టెస్టుల్లో కోహ్లీనే కింగ్', 'మైదానంలో నీ ఆటను చాలా మిస్సవుతున్నాం' అంటూ కామెంట్లు పెట్టారు.

టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ

లాక్​డౌన్ ప్రభావంతో మార్చి నుంచి అన్ని రకాల క్రీడలు నిలిచిపోయాయి. ఇటీవలే సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో పలు దేశాల క్రికెట్​ బోర్డులు.. మ్యాచ్​లు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే నెల 8 నుంచి ఇంగ్లాండ్-వెస్టిండీస్ టెస్టు సిరీస్​ జరగనుంది. దీనిని బయో సెక్యూర్​ వాతావరణంలో జరపనున్నారు.

అయితే ఇదే విషయమై మాట్లాడిన కోహ్లీ.. స్టేడియంలో ప్రేక్షకుల ఉన్నప్పుడు ఆటలో మజా వేరుగా ఉంటుందని, లేదంటే అలాంటి ఎమోషన్స్ ఉండవని చెప్పాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details