ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో చివరి టెస్టు ఆడుతోంది టీమిండియా. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసిన కోహ్లీసేన.. రెండో ఇన్నింగ్స్‌లో 168 పరుగులకు డిక్లేర్ చేసింది. కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగి సిరీస్‌ను ముగించాడు.
రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఫలితంగా డకౌట్‌తో విండీస్ టూర్‌ను ముగించాడు. టెస్టు కెరీర్లో ఈ ఆటగాడికిది నాలుగో గోల్డెన్ డక్. కీమర్ రోచ్ వేసిన బంతికి పెవిలియన్ చేరాడు. చివరగా 2018లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో పరుగులేమీ చేయకుండానే ఔటయ్యాడు.