విరాట్ కోహ్లీ... తనదైన బ్యాటింగ్‌తో ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. అవకాశమొస్తే చాలు చెలరేగిపోయే ఈ బ్యాట్స్‌మెన్... ఓ రికార్డు బ్రేక్ చేసేందుకు మాత్రం చాలా రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆ ఒక్కటి...
ప్రస్తుతం దక్షిణాఫ్రికాపై టెస్టులో డబుల్ సెంచరీ చేసిన విరాట్.. 6 జట్లపై ద్విశతకాలు చేసిన మూడో క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఈ ఘనత సాధించిన మూడో కెప్టెన్‌గానూ చరిత్ర సృష్టించాడు. ఇంతకు ముందు కుమార సంగక్కర(శ్రీలంక), యునిస్ఖాన్(పాకిస్థాన్) ఈ జాబితాలో ఉన్నారు. వీరిద్దరూ గతంలో వివిధ జట్లపై 6 డబుల్ సెంచరీలు చేశారు.
ఇప్పటికేటెస్టుల్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌పై ద్విశతకాలు సాధించాడు రన్ మెషీన్. కాని ఆస్ట్రేలియాపై మాత్రమే ఈ రికార్డు సాధించలేదు. కంగారూ జట్టుపై ఇప్పటివరకు విరాట్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు 169. దీనిని అధిగమించాలంటే రెండే అవకాశాలున్నాయి.
- 2020 నవంబర్-డిసెంబర్లో కంగారూ గడ్డపై భారత్ 4 టెస్టుల సిరీస్ ఆడనుంది. కోహ్లీకి దగ్గరలో ఉన్న తొలి అవకాశమిదే.
- స్వదేశంలో 2022 అక్టోబర్‌లో ఆస్ట్రేలియా-భారత్ మధ్య నాలుగు మ్యాచ్‌ల సిరీస్ ఉంది.