తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోహ్లీ ప్రేయసితో చాట్​ చేస్తే అతడికి నచ్చేది కాదు' - నిక్ కాంప్టన్ తాజ వార్తలు

టీమ్ఇండియా సారథి విరాట్​ కోహ్లీ మాజీ ప్రేయసితో చాట్​చేస్తే అతడికి నచ్చేది కాదని తెలిపాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నిక్ కాంప్టన్. 2012 భారత పర్యటన సందర్భంగా కోహ్లీతో చోటు చేసుకున్న వివాదం గురించి స్పందించాడీ ఆటగాడు.

compton
కాంప్టన్

By

Published : Jun 14, 2020, 10:02 PM IST

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ మాజీ ప్రేయసితో చాట్‌చేస్తే అతడికి నచ్చేది కాదని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ నిక్‌ కాంప్టన్‌ వెల్లడించాడు. తాజాగా అతడు క్రికెట్‌కు సంబంధించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ 2012 భారత పర్యటన సందర్భంగా తన టెస్టు అరంగేట్రంపై స్పందించాడు. ఈ నేపథ్యంలోనే ఆ సిరీస్‌లో కోహ్లీతో వివాదం తలెత్తిందని చెప్పాడు.

"ఓ రోజు సాయంత్రం సహచర ఆటగాళ్లు కెవిన్ పీటర్సన్, యువరాజ్ సింగ్, కోహ్లీ, నేను మరికొంతమంది అలా సరదాగా బయటకు వెళ్లాం. కోహ్లీ ప్రియురాలు కూడా మాతోనే ఉంది. అప్పుడు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశా. తను కూడా నాతో బాగానే మాట్లాడింది. మేమిద్దరం మాట్లాడుకోవడం కోహ్లీకి నచ్చలేదు. అందుకే ఆ సిరీస్‌లో నేను బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి అంటూ ఉండేవాడు. తను నా గర్ల్​ఫ్రెండ్ అనే చెప్పే ప్రయత్నం చేసేవాడు. ఆమె కూడా అతడు నా మాజీ ప్రియుడని చెప్పేది."

-నిక్ కాంప్టన్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్

అప్పుడా విషయం చాలా సరదాగా అనిపించిందని, తర్వాత అది ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకి తెలిసిందని చెప్పాడు కాంప్టన్. కోహ్లీని రెచ్చగొట్టడానికి దాన్నొక ఉపాయంలా మార్చుకున్నామన్నాడు. దాంతో అతడి ఏకాగ్రతను దెబ్బతీయాలని చూశామని స్పష్టం చేశాడు. కానీ విరాట్ మాత్రం చివరి మ్యాచ్​లో సెంచరీతో చెలరేగిపోయాడని తెలిపాడు. అయితే, అప్పుడు కోహ్లీ ప్రేయసిగా ఉన్న ఆమె పేరును మాత్రం ఈ ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ వెల్లడించలేదు.

ABOUT THE AUTHOR

...view details