తన జీవితంలోకి అనుష్క శర్మ వచ్చిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని అంటున్నాడు టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. తనను మామూలు వ్యక్తిగా మార్చి విభిన్న దృక్పథాలను ఆస్వాదించగలిగేలా అనుష్క మాయ చేసిందని.. ఆ క్రెడిట్ అంతా తనకే దక్కుతుందని తాజాగా మయాంక్ అగర్వాల్‌తో జరిగిన చాట్ సెషన్లో వెల్లడించాడు.
"నాలో ఇన్ని మార్పులకు కారణం నా భార్య అనుష్క. ప్రతి విషయాన్ని విభిన్న కోణాల్లో చూసే విధంగా నన్ను మార్చిన క్రెడిట్ తనదే. అనుష్క నా జీవిత భాగస్వామి అయినందుకు చాలా గొప్పగా ఫీలవుతున్నా. ఆటగాడిగా నా బాధ్యత, వ్యక్తులతో ఎలా నడుచుకోవాలో వంటి విషయాలను అనుష్క నుంచే నేర్చుకున్నా. ఒకవేళ నేను అనుష్కను కలవకపోయి ఉంటే నాలో ఎలాంటి మార్పు లేకుండా గతంలో ఉన్నట్లే ఉండేవాడిని అనుకుంటా. ఆమె నా జీవితంలోకి వచ్చి నన్ను వ్యక్తిగా మార్చింది".