క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ దగ్గరపడింది. సెప్టెంబరు 19న తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ఆటగాళ్లంతా ప్రాక్టీసు సెషన్లో స్వేదం చిందిస్తూ శ్రమిస్తున్నారు. అలా శిక్షణ ముగిసిన అనంతరం ఒత్తిడి నుంచి ఉపశమనానికి.. బీచ్, స్విమ్మింగ్ ఫూల్లో ఎంజాయ్ చేస్తున్నారు.
స్విమ్మింగ్ ఫూల్లో చిల్ అవుతున్న కోహ్లీ - ఆర్సీబీ
యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ కోసం ప్రాక్టీసు సెషన్లలో చెమటలు చిందిస్తున్నాడు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే అక్కడి వేడి వాతారణంతో పాటు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు.. జట్టు సభ్యులతో కలిసి స్విమ్మింగ్ ఫూల్లో సరదాగా గడుపుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
ఇందులో భాగంగానే ఆర్సీబీ సారథి కోహ్లీ కూడా స్విమ్మింగ్ ఫూల్లో ఆనందంగా గడుపుతూ కనిపించాడు. ఆయా ఫొటోలను విరాట్.. ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. అతడితో పాటు జట్టు సభ్యులు పవన్ నేగి, గుర్ కీరత్ సింగ్మన్ కూడా ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు.
ఐపీఎల్ కెరీర్లో కోహ్లీ ఇప్పటివరకు 5,412 పరుగులు సాధించాడు. 2016 సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 973 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. నాలుగు సెంచరీలు బాదాడు. అయితే, జట్టును మూడు సార్లు ఫైనల్‌కు చేర్చినా.. ట్రోఫీని మాత్రం అందించలేకపోయాడు. ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలనే పట్టుదల ఉన్నాడు విరాట్. ఇందుకోసం జట్టుతో కలిసి తీవ్రంగా కృషి చేస్తున్నాడు. సెప్టెంబరు 21న.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అమీతుమీ తేల్చుకోనుంది ఆర్సీబీ.