తెలంగాణ

telangana

By

Published : Oct 11, 2019, 1:59 PM IST

Updated : Oct 11, 2019, 2:07 PM IST

ETV Bharat / sports

దిగ్గజాల సరసన కోహ్లీ... నాలుగో స్థానం కైవసం

పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో శతకం సాధించాడు విరాట్​ కోహ్లీ. కెరీర్​లో​ 26వ టెస్టు సెంచరీ కాగా... కెప్టెన్​గా 19వది. అదే విధంగా ఈ ఏడాదిలో తొలి టెస్టు శతకం నమోదు చేశాడీ స్టార్​ బ్యాట్స్​మెన్​.

26వ టెస్టు సెంచరీ సాధించిన కోహ్లీ

పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులోటీమిండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీ సెంచరీ నమోదు చేశాడు. స్వదేశంలో సఫారీలపై ఈ బ్యాట్స్​మెన్ చేసిన తొలి శతకమిదే. అదే విధంగా ఈ క్రికెటర్ ఈ ఏడాది చేసిన మొదటి టెస్టు సెంచరీ కూడా ఇదే. కోహ్లీ టెస్టు కెరీర్​లో ఇది 26వది.. సారథిగా 19వది.

నాలుగో బ్యాట్స్​మెన్​...

అత్యంత తక్కువ ఇన్నింగ్స్​లో 26 సెంచరీల రికార్డు సాధించిన వారి జాబితాలో నాలుగో క్రికెటర్​ కోహ్లీ.ఈ ఫార్మాట్​లో ఆస్ట్రేలియా క్రికెటర్​ స్టీవ్​ స్మిత్​ను సమం చేశాడీ బ్యాట్స్​మెన్. విరాట్.. ఈ సెంచరీల రికార్డును 81 టెస్టుల్లో సాధించాడు. ఇదే ఘనతను 67 టెస్టుల్లోనే నమోదు చేశాడు స్మిత్​.

26 సెంచరీలు సాధించిన ఆటగాళ్లు (తక్కువ ఇన్నింగ్స్​ల్లో)

  • 69-డాన్​ బ్రాడ్​మన్​(ఆస్ట్రేలియా)
  • 121-స్టీవ్​ స్మిత్​(ఆస్ట్రేలియా)
  • 136-సచిన్​ తెందూల్కర్​(భారత్​)
  • 138-విరాట్​ కోహ్లీ(భారత్​)
  • 144-సునీల్​ గవాస్కర్​(భారత్​)
  • 145-మాథ్యూ హెడెన్​(ఆస్ట్రేలియా)

స్వదేశంలో దక్షిణాఫ్రికాపై కోహ్లీ.. తొలిసారి 100 పరుగుల మార్క్​ అందుకున్నాడు. ఈ బ్యాట్స్​మెన్​కు ఈ ఏడాదిలో ఇదే తొలి టెస్టు శతకం.

భాగస్వామ్యంలోనూ భేష్​...

టెస్టుల్లో దక్షిణాఫ్రికాపై నాలుగో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం(178) నమోదు చేసింది కోహ్లీ- రహానే జోడి. ఇప్పటివరకు నాలుగో వికెట్‌కు అత్యధిక పరుగులు(145) చేసిన రికార్డు ద్రవిడ్‌-గంగూలీ పేరిట ఉండేది.

కోహ్లీ, రహానే
Last Updated : Oct 11, 2019, 2:07 PM IST

ABOUT THE AUTHOR

...view details