తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత ఉత్తమ టెస్టు కెప్టెన్​గా విరాట్ కోహ్లీ

టీమిండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ.. కెరీర్​లో​ 26వ టెస్టు శతకాన్ని నమోదు చేశాడు. సారథిగా 40 సెంచరీలు పూర్తి చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్​లో భారత్ తరఫున అత్యుత్తమ కెప్టెన్​గా చరిత్ర సృష్టించాడు.

భారత ఉత్తమ టెస్టు కెప్టెన్​గా కోహ్లీ రికార్డు

By

Published : Oct 11, 2019, 2:33 PM IST

టెస్టు క్రికెట్​లో భారత కెప్టెన్​ విరాట్​కోహ్లీ రికార్డుల జోరు కొనసాగుతోంది. పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో శతకం చేసిన కోహ్లీ...మరో రికార్డుకు అడుగుదూరంలో నిలిచాడు. ఆస్ట్రేలియా క్రికెట్​ దిగ్గజం రికీ పాంటింగ్​ సారథిగా అత్యధిక శతకాలు(41) సాధించాడు.

26 ఏళ్ల కోహ్లీ...మాజీ భారత క్రికెటర్​ వెంగాస్కర్​(6,868)ను దాటేశాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో 53వ స్థానంలో ఉన్నాడు విరాట్​(6878*). భారత బ్యాట్స్​మెన్లలో 7వ స్థానంలో ఉన్నాడు. ఇతడి కంటే ముందు సచిన్ తెందూల్కర్​(15921), ద్రవిడ్​(13265), గవాస్కర్(10122), లక్ష్మణ్​(8781), సెహ్వాగ్​(8503), గంగూలీ(7212) ఉన్నారు.

కెప్టెన్​@50

ఇప్పటివరకు 50 టెస్టు మ్యాచ్​లు ఆడిన రెండో భారత కెప్టెన్​గా రికార్డు సృష్టించాడు విరాట్. గతంలో 2008 నుంచి 20104 వరకు కెప్టెన్​గా ఉన్న ధోనీ.. 60 మ్యాచ్​లకు ప్రాతినిథ్యం వహించి అగ్రస్థానంలో ఉన్నాడు. భారత మాజీ సారథి గంగూలీ(49)మూడో స్థానానికి పడిపోయాడు.

విజేతగానూ...

49 మ్యాచ్​ల్లో 29 టెస్టు విజయాలు సాధించాడు విరాట్. ధోనీ.. 60 మ్యాచ్​ల్లో 27 మాత్రమే గెలిచాడు. తద్వారా భారత క్రికెట్​ చరిత్రలో ఉత్తమ టెస్టు కెప్టెన్​గా రికార్డు సృష్టించాడు కోహ్లీ.​ మొత్తం కెప్టెన్​లలో స్టీవ్​వా, రికీ పాంటింగ్​ తర్వాత విజయశాతం కోహ్లీదే అధికం.

వేయి పరుగులు...

సఫారీలపై టెస్టుల్లో వేయి పరుగులు చేశాడు విరాట్​కోహ్లీ. 19 ఇన్నింగ్స్​ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సాధించిన ముగ్గురు భారత ఆటగాళ్లనూ అధిగమించాడీ క్రికెటర్. ఇతడి కంటే ముందు సెహ్వాగ్​(20), తెందూల్కర్​(29), ద్రవిడ్​(30) ఉన్నారు.

ఓవరాల్​గా నలుగురు మాత్రమే కోహ్లీ కంటే ముందు దక్షిణాఫ్రికాపై వేయి పరుగులు చేశారు. డెన్నిస్​ క్రాంప్టన్​(13), నీల్​ హార్వే(13), డేవిడ్​ వార్నర్​(18), మైకేల్​ క్లార్క్​(18) ఈ రికార్డు అందుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details